Friday, April 19, 2024

కొరటాలకి మెగాస్టార్ స్పెషల్ విషెస్ !!

నేడు కొరటాల శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీస్టార్ అలాగే అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో కొరటాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకమైన విషెస్ తెలియజేశారు. ఆ కులానికి సమాజంలో మార్పు తేవాలని తపన ఉంది. ఆ దర్శకుడికి ఆశయాన్ని దృశ్యం గా మలిచే దార్శనికత ఉంది. ఆచార్య సృష్టికర్త కొరటాల శివ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా కొరటాల శివ మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు చిత్రయూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement