Thursday, April 25, 2024

చిరు ఎవరిని ఫాలో అవుతున్నారో మీకు తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల జోరు పెంచారు. సినిమాలతోనే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోను ట్విట్స్ తో అభిమానులను అలరిస్తుంటారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత చిరంజీవిని కొన్ని లక్షల మంది ఫాలోఅవుతున్నారు. అందులో అభిమానులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే చిరంజీవి మాత్రం ఒక్కరిని ఫాలో అవుతున్నారు. మరీ చిరు ఫాలో అవుతున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయ‌నే సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి. ఈ విషయాన్ని గుర్తించిన ఒక‌రు రామ జోగ‌య్య శాస్త్రికి ట్వీట్ చేశారు. సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రామ జోగ‌య్య శాస్త్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చిరంజీవి స‌ర్ ప్రేమ‌, ఆశీర్వాదాల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను అంటూ రామ జోగ‌య్య శాస్త్రి పేర్కొన్నారు. కాగా రామ జోగ‌య్య శాస్త్రి ఆచార్యకు పాట‌లు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement