Sunday, May 28, 2023

అల్లుఅర్జున్ తగ్గేదేలే!!! అఖిల్, బన్నీలకు చిరు విషెస్

అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, వీళ్లంతా కూడా మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడలలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారే. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్నపుష్ప ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అయితే ఈ టీజర్ కు అతి తక్కువ సమయంలోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యారు. పుష్ప టీజర్ చూసాను చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉందని అలాగే పుష్ప రాజ్ గా బన్నీ తగ్గేది లే అంటూ చిరు విషెష్ చెప్పారు.

- Advertisement -
   

మరోవైపు అక్కినేని అఖిల్ కు కూడా మెగాస్టార్ విషెస్ తెలిపారు. సక్సెస్ కి హార్డ్ వర్క్ ని మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ హార్డ్ వర్క్ నే నమ్ముకున్నావని నేను నమ్ముతున్నాను అఖిల్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement