Wednesday, April 24, 2024

‘మా’ క్రమశిక్షణ సంఘానికి మెగాస్టార్ రాజీనామా – ఏమైంది ?

మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా నరేష్ అధ్యక్షతన 2019లో ఈ కొత్త ప్యానల్ ఏర్పాటయింది. అయితే ఈ ప్యానల్ కు సంబంధించిన పాలనా కాలం ఇప్పుడు ముగిసింది. ఇక ఈ ప్యానల్ ఏర్పాటు అయిన కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ రెండు భాగాలుగా విడిపోయారు.

సినీ పెద్దలు మోహన్ బాబు, చిరంజీవి, మురళీమోహన్, జయసుధ, కృష్ణంరాజు వంటి వారు వీరి మధ్య విభేదాలు తొలగించి కలపడానికి చూసినప్పటికీ అవి ఫలించలేదు. అంతేకాదు రాజశేఖర్ నరేష్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. రాజశేఖర్ కూడా వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ మా ఎన్నికలకు సమయం దగ్గర పడింది.

ఇన్నాళ్లు మా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement