Thursday, October 3, 2024

Record | చిరంజీవికి మ‌రో ఘ‌న‌త‌…

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

155కి పైగా చిత్రాల్లో తన డ్యాన్స్‌తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement