Friday, March 29, 2024

నారప్ప పై చిరు ప్రశంసలు…!!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య ఓటీటీ లో రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కంగ్రాట్స్ నారప్ప….ఇప్పుడే చూశాను. ఆ నటన ఆ ట్రాన్స్ఫర్మేషన్ వావ్ అంటూ కితాబిచ్చారు చిరంజీవి.ఎక్కడా వెంకటేష్ కనబడలేదు. నారప్ప కనిపించాడు అంటూ చెప్పుకొచ్చారు.

కొత్త వెంకటేష్ ను ఈ సినిమాలో చూశానని పాత్రను ఎంతగానో అర్థం చేసుకొని చాలా డెప్త్ కి వెళ్లి నటించావని అన్నారు. నీలో నటుడు ఎప్పుడూ ఒక తపనతో తాపత్రయంతో ఉంటాడు అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం మంచి పేరుతో పాటుగా కెరీర్ లో గర్వంగా చెప్పుకునే చిత్రం అని చిరంజీవి అన్నారు. అయితే చిరు ట్వీట్ కు వెంకటేష్ కూడా స్పందించారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మాకు ఎంతో సంతోషం ను ఇచ్చింది. థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement