Sunday, April 11, 2021

తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా… నెటిజన్స్ పై నాగబాబు ఫైర్

ఇటీవల కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అడిగే ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్ కూడా ఇస్తున్నారు. కాగా ఇటీవల వరుణ్ మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడండి… అని ఆన్సర్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో సారి వరుణ్ పెళ్లి అంశం తెరపైకి వచ్చింది.

వరుణ్ అన్నా… సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తారా జోడి బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగబాబు జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్ కోర్ట్ సీన్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ సీన్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే అంటూ చెబుతారు. ఇక ఇప్పుడు నాగబాబు పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News