Friday, April 26, 2024

రాజ్యాన్ని పాలించే రాజు కంటే నా తమ్ముడు గొప్ప – నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని ఎవరు ఏమన్నా సరే నాగబాబు వెంటనే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ కొటేషన్ చెప్పారు నాగబాబు. రాజుకు హీరోకు మధ్య ఉన్న తేడాను చెబుతూ రాజు కంటే హీరో గొప్ప అని అన్నారు. రాజు కేవలం తన రాజ్యం కోసం మాత్రమే ఆలోచిస్తారు.దానికోసమే పోరాడతాడు. కానీ హీరో మాత్రం అందరి గురించి పోరాడుతానని అదే నువ్వు అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చారు.

ఒక హీరో రాజు చేసే దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలుస్తాడు. గెలుపోటములు గురించి ఆలోచించకుండా ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటాడని నాగబాబు అన్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement