Monday, September 16, 2024

Meenakshi | మూడు మూవీల‌పైనే మీనాక్షి ఆశ‌లు…

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించే ఛాన్స్ అందుకుంది మీనాక్షి. సినిమాలో ఆమె రోల్ కు స్కోప్ పెద్దగా లేకపోయినా చాలా అందంగా కనిపిస్తూ మెప్పించింది.

రీసెంట్ గా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి GOAT మూవీలో యాక్ట్ చేసింది మీనాక్షి. కెరీర్‌ లో ఆమెకు ఇదే పెద్ద సినిమాగా చెప్పవచ్చు. కానీ మూవీలో ఆమె రోల్.. ప్రేక్షకులను నిరాశ పరిచింది. సినిమా సెకండాఫ్ లో మీనాక్షి.. పూర్తిగా సినీ ప్రియులను డిస్సపాయింట్ చేసింది. దీంతో ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ పై హోప్స్ పెట్టుకుంది అమ్మడు.

మంచి హిట్లు అందుకోవాలని చూస్తోంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా వాస్తవానికి సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. కానీ అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియా లెవెల్ లో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్కీ భాస్కర్ తో పాటు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో కూడా యాక్ట్ చేస్తోంది మీనాక్షి చౌదరి. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా మీనాక్షి నటిస్తోంది. దీంతో ఈ మూడు చిత్రాలతో హిట్లు కొడితే కెరీర్ లో ఆమెకు తిరుగుండదు. లేకుంటే కొత్త అవకాశాలు రావడం కష్టమే. మరేం జరుగుతుందో చూడాలి

Advertisement

తాజా వార్తలు

Advertisement