Sunday, September 22, 2024

Meenakshi Chaudhary | ఇక స్క్రీన్ అంతా గ్లామ‌ర్ షోనే !

అందం, అభినయం కలబోసిన నటి మీనాక్షి చౌదరి, టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటోంది. ఫ్యాషన్ ఫోటోషూట్లలో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ సుందరి, ఇటీవల వైట్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సింపుల్ స్టైల్‌లోనే మీనాక్షి కనిపించినా, ఆమె లుక్ ని చూసిన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. మోడల్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మీనాక్షి, ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బిజిగా సినిమాలు చేస్తోంది.

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అమ్మడి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఇక రీసెంట్ షేర్ చేసిన ఫోటోలకు లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు రావడం గమనార్హం. మీనాక్షి లుక్‌ పై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

అలాగే బ్యూటీఫుల్ క్వీన్ అంటూ కొనియాడుతున్నారు. ఈ లుక్‌లో ఆమె ప్రొఫెషనల్ మోడల్ ఫీల్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంది. సమకాలీన నటీమణులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటున్న మీనాక్షి, రాబోయే రోజుల్లో మరింత పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement