Wednesday, October 9, 2024

Matka రిలీజ్ డేట్ అనౌన్స్..

వరుణ్ తేజ్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా మట్కా మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ రెట్రో లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. నవంబర్ 14న మట్కా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మట్కా సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement