Friday, April 19, 2024

నో గ్యాప్ @మాస్ మహారాజా రవితేజ

మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ఆఖరులో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది.అలాగే ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి బ్రేక్ వేసింది. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా రవితేజ గ్యాప్ తీసుకోవడం లేదట. అలాగే వచ్చేనెల త్రినాధరావు నక్కిన సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. అయితే రవితేజ సరసన ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్న ట్లు సమాచారం. ఈ రెండు సినిమాల తో పాటు రవితేజ శంకర్ మండవ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement