Friday, April 19, 2024

సబ్ కలెక్టర్ గా మాస్ మహారాజ!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర పై రకరకాల వార్తలు తెరపైకి రాగా… తాజాగా దర్శకుడు శరత్ మండవ రవితేజ పాత్ర పై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రవితేజ ఇందులో ఒక నిజాయితీ గల సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని, అయితే ఆ పాత్రలో రెండు పార్శ్వాలు ఉండటమనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను 1995 బ్యాక్ డ్రాప్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ తో రెడీ చేశామని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement