Friday, April 19, 2024

హాలీవుడ్ ని తలపిస్తున్న మాస్ మహారాజా !!

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా గతంలో ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రవితేజ బైక్ చేజింగ్ సీక్వెన్స్ లు చూస్తే హాలీవుడ్ స్థాయి యాక్షన్ ని చూడబోతున్నట్లు అర్థమవుతోంది.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కిలాడి సినిమాలో డింపుల్ హయాతి ,మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అనసూయ, వెన్నెల కిషోర్, రావురమేష్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement