Wednesday, February 8, 2023

రి-రీలీజ్‌కి రెడీ అయిన మాస్ మహరాజ్ సాలిడ్ హిట్ మూవీ..

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ భారీ హిట్ కాగా.. రీసెంట్ గా తాను గెస్ట్ రోల్ లో నటించిన మెగా మాస్ మల్టీస్టారర్ సినిమా “వాల్తేరు వీరయ్య” కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో రవితేజ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనల్ హిట్ ‘విక్రమార్కుడు’ మూవీని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

- Advertisement -
   

అయితే ఈ సినిమాతో పాటుగా మరో మూవీ కూడా రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో మరో సాలిడ్ కం బ్యాక్ హిట్ అయిన “మిరపకాయ్” అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈ నెల (జనవరి)26 మాస్ మహరాజ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement