Wednesday, June 23, 2021

పెళ్లి చేసుకున్నది నిజమే….నటి సంజన

నటి సంజన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమా లో నటించింది. అయితే ఇక ఇటీవల డ్రగ్స్ కేసులో కూడా ఆరోపణలను సంజన ఎదుర్కొంది. అదే సమయంలో అజీజ్ తో పెళ్లి అయినట్లు ఫోటో బయటకు వచ్చింది. కానీ తనకు పెళ్లి కాలేదని ప్రకటించింది. కాగా ఇప్పుడు అసలు విషయాన్ని ప్రకటించింది.

గతేడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటిదాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్ గా అజీజ్ పాషా పని చేస్తున్నారని పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీస్ కేసు లతో ఇబ్బంది పడ్డానని అందుకే చెప్పలేదని తెలిపింది. అలాగే అందరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News