Sunday, November 10, 2024

Manushi Chhillar | చిల్ మ‌నిపిస్తున్న మాజీ మిస్ వ‌రల్డ్ !

మాజీ మిస్ వ‌ర‌ల్డ్.. మిస్ ఇండియా మానుషి చిల్లర్ ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో తానో బ్రాండ్ బ్యూటీ. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో అల‌రించ‌డం మానుషీ ప్ర‌త్యేక‌త‌. మోడ‌లింగ్ లో ఆరితేరిన బ్యూటీ కావ‌డంతో న‌లుగురిలో మ‌రింత స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

తాజాగా అమ్మ‌డు లాక్మే ఫ్యాష‌న్ వీక్ లో మ‌రోసారి త‌నలో బ్యూటీతో మ‌తిపోగొట్టింది. అమ్మ‌డు షోని లైవ్ లో వీక్షిస్తున్న వారంతా? అలా క‌ళ్ల‌ర్ప‌కుండా వీక్షించి ఉంటారు. అంతటి బ్యూటీతో మానుషీ అల‌రిస్తుంది. డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాబినేష‌న్ డిజైన్ లో అమ్మ‌డు మెరుపులా మెరిసింది. పాల నురుగ‌ల శ‌రీర సౌంద‌ర్యంపై అంద‌మైన డిజైన‌ర్ లో మ‌రింత అందంగా హైలైట్ అయింది.

చేతి మ‌ణిక‌ట్టుకు పింక్ కాంబినేష‌న్ ..కాలికి ధ‌రించి హై హీల్స్ అదే రంగులో హైలైట్ చేసింది. పెదాల‌పై అంద‌మైన న‌వ్వు షేస్ కి మ‌రింత బ్యూటీని జోడించింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ చివ‌రి క్ష‌ణాన‌.. రెండు చేతులు హిప్ పై పెట్టుకుని వ‌య్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement