Saturday, April 20, 2024

మంచి రోజులు వచ్చాయి…ఫస్ట్ లుక్ వచ్చింది

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడానికి మారుతి ప్లాన్ చేశాడు. ఆ తర్వాత గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఆలోచిస్తున్నాడు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో సంతోష్ గోడకు ఆనుకొని నిల్చొని ఉండగా… పక్కనే మెహరీన్ నిలుచొని కనిపిస్తుంది. ఈ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement