Friday, March 29, 2024

బాల‌కృష్ణ, అల్లు అర్జున్ ల మ‌ల్టీస్టార‌ర్ !

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు, వెంక‌టేష్, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇలా ప్ర‌తి ఒక్క‌రూ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి మొగ్గు చూపుతున్నారు. కాగా హీరో బాల‌కృష్ణ , నిర్మాత అల్లు అర‌వింద్ ఓటీటీ సంస్థ ఆహా అన్ స్టాప‌బుల్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. దాంతో వారి మ‌ధ్య స‌న్నిహిత్యం పెరిగింది. దాంతో బాల‌య్య న‌టించిన అఖండ చిత్రం ఈవెంట్ కి చీప్ గెస్ట్ గా వ‌చ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాలకృష్ణ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్త బాలయ్య, బన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement