Sunday, March 24, 2024

శాకుంత‌లం నుండి.. మ‌ల్లికా మ‌ల్లికా వీడియో సాంగ్

శాకుంత‌లం చిత్రం నుండి 1:12 నిమిషాల నిడివిగల వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేక‌ర్స్. మల్లికా మల్లికా మాలతీ మాలిక .. చూడవా చూడవా ఏడే నా ఏలికా అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రమ్య బెహ్రా మధురంగా ఆలపించింది.ద‌ర్శ‌కుడు గుణశేఖర్ అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు. దుష్యంతుడి కోసం ఎదురుచూస్తూ శకుంతల పాడుకునే పాటగా ఇది తెరపైకి రానుంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో శాకుంత‌ల‌గా స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించింది. సీనియ‌ర్ న‌టులు మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నటుగా చెప్పారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement