Thursday, April 25, 2024

బరువు తగ్గిన ఎన్టీఆర్ బ్రదర్ – 3 నెలల్లో 16 కేజీలు

సినీ హీరోలు, హీరోయిన్లు కొన్ని కొన్ని సినిమా కోసం బరువు పెరుగుతూ ఉంటారు. మరి కొన్ని సినిమాల కోసం బరువు తగ్గుతారు. సినిమా కథను బట్టి వారి పాత్రను బట్టి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే గతంలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క శెట్టి చాలా బరువు పెరిగారు. ఆ తర్వాత సన్నపడటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా బరువు తగ్గేందుకు చాలా కష్టపడుతున్నాడట. మెప్పాడియన్ సినిమా కోసం బరువు పెరిగిన ఉన్ని ముకుందన్… 93 కేజీల వరకు చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత సన్నబడేందుకు జనవరి నుంచి శ్రమించి 16 కేజీల బరువు తగ్గడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోల రూపంలో తెలియజేశాడు.

మనం నిజానికి మనం అనుకున్న దాని కంటే పవర్ఫుల్ .నేను అనుకున్న మూడు నెలలు ఫిట్నెస్ ఛాలెంజ్ లో నాతో పాటు చాలా మంది పాల్గొనడం ఆనందంగా ఉందని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతంలో జనతా గ్యారేజ్, భాగమతి చిత్రాలలో ఉన్ని ముకుందన్ నటించాడు. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు..

https://www.instagram.com/reel/CN_YmJEB5i3/?igshid=1xh5eug4ysz5a

Advertisement

తాజా వార్తలు

Advertisement