Friday, March 29, 2024

కేజీఎఫ్2 డబ్బింగ్ చెప్తున్న మాళవిక

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన న్యూస్ చీఫ్ ఎడిటర్ దీపా పాత్ర చేసిన సీనియర్ నటి మాళవిక తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ మేర ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్ లో మాళవిక మంచి పాత్రను పోషించారు. ఇక ఈ పార్ట్ లో మాళవిక పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఇందులో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement