Friday, April 26, 2024

విజయ్ దళపతికి ఇష్టమైన హీరో ఎవరో చెప్పిన మాళవిక

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.బర్త్ డే సీడీపీలతో హంగామా చేస్తున్నారు. అయితే విజయ్ కు సంబంధించి కొన్ని వ్యక్తిగత రహస్యాలను బయట పెట్టారు హీరోయిన్ మాళవిక. విజయ్ దళపతి కి బాలీవుడ్ స్టార్ హీరో టైగర్స్ ష్రాఫ్ అంటే ఎంతో ఇష్టమని విజయ్ తో కలిసి బాఘీ3 సినిమా ని చూశానని చెప్పుకొచ్చారు మాళవిక.

అంతేకాకుండా విజయ్ ఆ సమయంలో తలైవా అంటూ అరిచాడని మాళవిక మోహన్ తెలిపింది. అంతేకాకుండా విజయ్ కు చెన్నై, తమిళ్ నాడు తర్వాత ఇష్టమైన ప్రదేశం న్యూయార్క్ అని తెలిపింది. ఇక మాళవిక విజయ్ తో ఇటీవల మాస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement