Friday, April 26, 2024

సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్….#28 సినిమా అనౌన్స్

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు గడుస్తున్నా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు హీరో సందీప్ కిషన్. హై హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అయితే మొదటి నుంచి కూడా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇక తాజాగా ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తన 28వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సూపర్, నేచురల్, ఫాంటసీ కథతో ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా రాజేష్ దందా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా టైగర్ సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం గల్లీ రౌడీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవల సందీప్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement