Friday, April 26, 2024

అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్…మహేష్ రూట్ మార్చడా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు… ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే పరశురామ్ కూడా ఈ చిత్రాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాడట.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు పేల్చే ప్రతి పంచ్ డైలాగ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందట. అలాగే ఈ సినిమాలో ఫుల్ లెన్త్ లో అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ యాసలో మహేష్ మాటలు ఉంటాయట. మరి ఈ సినిమాతో మహేష్ ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా… కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement