Thursday, March 28, 2024

మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన సంగతి తెలిసిందే. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి ఈ గుండె ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన మహేష్ బాబు …తాజాగా మరో చిన్నారికి గుండె చికిత్స చేయించి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత ఇంస్టాగ్రామ్ లో చెబుతూ చిన్నారి ఫోటో షేర్ చేశారు.

కృతజ్ఞత కు మరొక రోజు. చీకటి నుంచి మరో ఆశాకిరణం… సొరంగం చివర కాంతి ఉందని నేను నమ్ముతున్నాను అంటూ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని చెప్పారు నమ్రత. గుండె కవాటం మూసుకుపోవటం తో శస్త్రచికిత్స చేయించుకున్న మధుప్రియ బాగానే ఉన్నారని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు నమ్రత. పిల్లలకు కుటుంబానికి దైవ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

https://www.instagram.com/p/CPnxyr1D-ZR/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement