Saturday, April 20, 2024

పవన్ కొలుకోవాలంటూ మహేష్ బాబు ప్రార్ధనలు

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అలాగే అభిమానులు పెద్ద సంఖ్యలో గెట్ వెల్ సూన్ అన్న అంటూ పోస్టులు పెడుతున్నారు.

కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోలుకోవాలి అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీకు బలం చేకూరాలి. మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. కాగా అపో హాస్పిటల్ వైద్య బృందం పవన్ కు సంబంధించిన్ కండిషన్ ను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement