Saturday, April 20, 2024

కెసిఆర్ కు కరోనా – మహేష్ బాబు ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. ఇక కేసీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ లు చేస్తున్నారు.

అలాగే సినీ రాజకీయ ప్రముఖులు కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. కెసిఆర్ సార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement