Monday, May 17, 2021

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు టీవీలలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… థియేటర్స్ లో మాత్రం ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయాయి. అయితే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ వెనక ఓ కారణం కూడా ఉందట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు కూడా ఇదే. కాబట్టి ఇప్పుడు అదే పేరుతో సినిమా టైటిల్ రాబోతుందని తెలుస్తోంది. అయితే ఎక్కడా కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News