Wednesday, March 27, 2024

యంగ్ లుక్ లో మహేష్ బాబు….ఫోటో వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.ఇక గ్లామర్ విషయంలో అయితే మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నా యంగ్ లుక్ లో కనిపిస్తారు మహేష్ బాబు. ఎంత యంగ్ అంటే తన పిల్లలకు అన్నయ్యలా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.

ఆ ఫోటోలో ఖాళీ చేసిన థమ్సప్ బాటిల్ తో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ లో కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement