Friday, April 26, 2024

తెరుచుకోనున్న సినిమా థియేటర్లు..

కరోనా సెకండ్ వేవ్ క్షీణిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్‌ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్ చేయాలని, మాస్క్ తప్పనిసరి అని తెలిపింది. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించుకోవచ్చు అని మహారాష్ట్ర సర్కార్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement