Saturday, April 20, 2024

సినిమా షూటింగ్ లకు ఆంక్షలు..

కరోనా సెకండ్‌ వేవ్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడంతో కొన్ని సినిమా షూటింగ్స్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కరోనా కట్టడి ప్రయత్నాల్లో భాగంగా ది ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ షూటింగ్స్ కు సరికొత్త నియమావళిని రూపొందించింది. ఈ మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే సినిమా షూటింగ్స్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. ఏప్రిల్‌ 30 వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఎక్కువ మంది ఆర్టిస్టులతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించకూడదు. గ్రూప్‌ సాంగ్స్‌ షూట్స్‌ ఇప్పుడు జరగడానికి వీలులేదు. ఇక సినిమా లొకేషన్స్‌‌, ప్రొడెక్షన్‌ ఆఫీసులు, పోస్ట్‌ ప్రొడెక్షన్‌ స్టూడియోల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్‌ చేయాలి. అలాగే ఆయా ప్రదేశాల్లో పనిచేసేవాళ్లు తప్పకుండా మాస్క్‌ ధరించాలి.నిత్యం ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు చెందిన ఓ బృందం షూటింగ్స్‌ జరిగే లొకేషన్స్‌కు చేరుకుని పర్యవేక్షించనుంది. ఒకవేళ ఎవరైనా కొవిడ్‌-19 నిబంధనలు పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement