Thursday, April 25, 2024

మాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ !!

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇటీవలే రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అందాధూన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ప్రోమో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బేబీ ఓ బేబీ అంటూ విడుదలైన ఈ ప్రోమో సాంగ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి లిరికల్ సాంగ్ రేపు ఉదయం 10గంటల ఎనిమిది నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement