Thursday, March 28, 2024

మాస్ట్రో బేబీ ఓ బేబీ…లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ అందాదున్ కు ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. బేబీ ఓ బేబీ అంటూ సాగే ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. అలాగే ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement