Friday, April 26, 2024

రామ్ సినిమాలో మాధవన్….క్లారిటీ వచ్చేసింది!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు మాధవన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నారని ఆ మధ్య టాక్ నడిచింది.

అయితే ఈ విషయంపై మాధవన్ క్లారిటీ ఇచ్చారు. లింగుస్వామి డైరెక్షన్ లో చేయటానికి తనకి కూడా ఇష్టం ఉందని… కానీ ఇప్పుడు తను ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటిస్తున్నాను అన్న వార్తలో మాత్రం ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇక దీంతో ఈ ప్రాజెక్టులో మాధవన్ లేడు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement