Saturday, April 20, 2024

మామ‌న్న‌న్.. అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

హీరో ఉద‌య‌నిధిస్టాలిన్.. స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు న‌టిస్తున్న చిత్రం మామ‌న్న‌న్.ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్ జోనర్‌లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది వడివేలు టీం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను షేర్ చేసింది.మామన్నన్‌ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్‌ షురూ.. ఎక్జయిట్‌మెంట్‌ మొదలు.. అంటూ ఉదయనిధి స్టాలిన్‌తో వర్షంలో గొడుగు పట్టుకొని నిల్చున్న మూవీ పోస్టర్‌ను షేర్ చేసుకుంది కీర్తిసురేశ్‌. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.ఆస్కార్ విన్నింగ్‌ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో వడివేలుతో ఓ పాట కూడా పాడించాడు ఏఆర్‌ రెహ్మాన్‌. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ సందర్భంగా స్టూడియోలో వడివేలుతో కలిసి దిగిన స్టిల్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.మామన్నన్‌ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్ జియాంట్‌ మూవీస్‌పై ఎం షెంగబాగ్‌ మూర్తి, ఆర్‌ అర్జున్ దురై నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement