Thursday, April 25, 2024

మా ఎల‌క్ష‌న్స్: తుది అభ్య‌ర్ధుల జాబితా ఇదే..!

‘మా’ ఎన్నికలు మ‌రో వారం రోజుల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నామినేష‌న్స్, ఉప‌సంహ‌ర‌ణ‌లు కూడా పూర్త‌య్యాయి. బండ్ల గ‌ణేష్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు నామినేష‌న్స్‌ని ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి విష్ణు ప్యానల్‌ నుంచి బాబూ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ పోటీ చేస్తున్నారు. ఇక వైస్‌ ప్రెసిండెంట్‌ పదవులకు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బెనర్జీ, హేమలు, విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి, పృథ్వీ రాజ్‌ పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీకి పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు; కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు; రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు.

ఇక అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, అదే రోజు ఫ‌లితాలు కూడా వెల్ల‌డించ‌నున్నారు.

ఇది కూడా చదవండి: ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. చెన్నైపై ఆర్ ఆర్ ఘనవిజయం..

Advertisement

తాజా వార్తలు

Advertisement