Wednesday, April 24, 2024

“లవ్ స్టోరీ” డే వన్ కలెక్షన్స్..

కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా రోజుల తర్వాత మూవీ హాల్స్ వద్ద సందడి నెలకొంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ -19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల ప్రదర్శన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ చిత్రంలో దర్శకుడు చూపించిన చక్కటి కథాంశం, కథనం, కుల వివక్షపై సామాజిక సందేశం అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.

ఇక సినిమా కలెక్షన్ల విషయానికొస్తే… “లవ్ స్టోరీ” ఏపీ, తెలంగాణాలో థియేట్రికల్ రన్ తో రూ. 6.5-రూ. 7.5 కోట్ల మధ్య షేర్ వసూలు చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఈ కలెక్షన్ నాగ చైతన్య కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా మ్యాజిక్ సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ బిజినెస్‌ రూ .26.3 కోట్లు కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ .32 కోట్లు. వారాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement