Thursday, April 25, 2024

అఖండ క్లైమాక్స్ కోసం వెతుకులాట!!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను సాధించాయి.

దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ తో పాటు ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కాగా క్లైమాక్స్ కోసం కడప చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్లేస్ లను వెతికే పనిలో పడ్డారట చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement