Saturday, April 20, 2024

లైఫ్ ఆఫ్ రామ్…సరికొత్త రికార్డ్

విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం 96. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కాగా ఈ సినిమాకు రీమేక్ గా తెలుగులో జాను చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తమిళ్ లో సక్సెస్ అయినంత విధంగా తెలుగులో సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ పాటల మాత్రం మంచి హిట్ అయింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. సింగర్ ప్రదీప్ కుమార్ పాటలు ఆలపించారు. ఇదిలా ఉండగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి కొత్త ఘనతను సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement