Tuesday, March 26, 2024

బిగ్ బాస్ హోస్ట్ గా ప్రముఖ నిర్మాత

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఒక్క హిందీ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈద్ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 15 కు సంబంధించి హోస్ట్ గా వ్యవహరించనున్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సరికొత్త సీజన్ ను ఆవిష్కరించారు. ల్ ఇది ఆగస్టు 8 నుంచి ప్రదర్శించబడుతోందని ప్రకటించారు. అయితే ఆ సరికొత్త సీజన్ కు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మొదట సిద్ధార్థ్ శుక్లా, రోహిత్ శెట్టి, వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా కొత్త సీజన్ హోస్ట్ గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు ,కరణ్ జోహార్ వ్యవహరించనున్నారని నిర్వాహకులు అధికారికంగా ప్రకటన చేశారు. బిగ్ బాస్ ఓటీటీ ఆరు వారాలపాటు 24×7 ప్రసారం కానుందని ప్రకటించారు. ఇది టెలివిజన్ వెర్షన్ కంటే ముందే వూట్‌లో ప్రసారం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement