Friday, April 19, 2024

అహం బ్రహ్మాస్మి లో లావణ్య త్రిపాటి!!

ఎప్పటి నుంచో సినిమాలకు దూరమైన మంచు మనోజ్ అహం బ్రహ్మష్మి సినిమాతో బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు. అయితే కథల విషయంలో మంచు మనోజ్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రెడీ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక జర్నలిస్ట్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. అదికూడా సెకండాఫ్ లో ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా మనోజ్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement