Friday, March 29, 2024

థాంక్యూ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ !!

అక్కినేని నాగ చైతన్య హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇక మరో వైపు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. అయితే కొన్నాళ్ళ క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా పై ఓ అప్డేట్ వచ్చింది.

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్…ఈ సారి ఇటలీలో సూట్ ను ప్లాన్ చేశారట. ఇందులో చైతన్య తో పాటు హీరోయిన్ రాశి కన్నా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా కనిపించడమే కాకుండా.. స్పోర్ట్స్ మ్యాన్ గా కూడా చైతు కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement