Saturday, April 20, 2024

రామ్ చరణ్ శంకర్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ !!

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆపరేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో శంకర్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించనున్నారట. అంతే కాకుండా ఓ భారీ సెట్ ను కూడా వేసి కీలక సన్నివేశాలను అందులో తీయనున్నారట. కాగా ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియ రావాల్సిఉంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement