Tuesday, April 23, 2024

పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 2 పై లేటెస్ట్ అప్‌డేట్!

దర్శకుడు మణిరత్నం రూపోందించిన పాన్ఇండియ‌న్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా అన్ని భాషలతో కలిపి 314.70 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ సంపాదించింది. అయితే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, విక్రమ్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన‌ ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 2 పై ప‌డింది. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

కాగా, లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం పొన్నియ‌న్ సెల్వ‌ప్ 2 వ‌చ్చే నెల (ఏప్రిల్) 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఈ నెల చివ‌రి నాటికి (మార్చి 29) ప్ల‌న్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో 3 నిమిషాల ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయ‌నున్నట్టు సమాచారం. ఈ ట్రైల‌ర్ అవుట్‌పుట్ ఆకట్టుకునేలా ఉందని.. సినిమా విజయంపై మేకర్స్ చాలా సంతోషంగా, నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే, ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి అఫీషియల్ అప్‌డేట్ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement