Thursday, March 28, 2024

పుష్ప ఆల్బమ్ పై లేటెస్ట్ అప్డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే అల్లు అర్జున్, సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ మరో లెవెల్ లో ఉంటుంది. అలాగే ఈ ఆల్బమ్ పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా చాలా బాగా వచ్చిందట. కొన్నాళ్లపాటు ప్లే లిస్ట్ లో కూడా ఈ సాంగ్స్ ఉంటాయట. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సాంగ్స్ మంచి సక్సెస్ ను సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement