Saturday, April 20, 2024

’18 పేజెస్’ లేటెస్ట్ అప్డేట్

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా మరోవైపు నిఖిల్ 18 పేజెస్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల షూటింగ్ జరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలోనూ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరో మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతా ఉంటాడని సినిమా మొత్తం ఒక డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని సమాచారం. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ,సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement