Friday, April 19, 2024

అఖండ అప్డేట్ పై లేటెస్ట్ ఇన్ఫో

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రాజెక్టులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఆ అప్డేట్ రానుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement