Monday, May 29, 2023

ఎన్టీఆర్‌తో ఆదిపురుష్ భామ.. అభిమానులకు ఇక కనుల పండుగే

ఆస్కార్ ఈవెంట్‌కు హాజరైన తర్వాత ఈ మ‌ధ్య‌నే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ #NTR 30 కోసం రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తారక్‌తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది. కాగా, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ RRR నటుడితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నట్లు తాజా సమాచారం. అయితే, ఇది సినిమా కోసం కాదు, కమర్షియల్ యాడ్ కోసం అని తెలుస్తోంది.

- Advertisement -
   

వీరిద్దరు ప్రసిద్ధ ఆపిల్ జ్యూస్ డ్రింక్ అప్పీ ఫిజ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నారు. ఈ బేవరేజ్ సరికొత్త కమర్షియల్ యాడ్ కోసం వీరిద్దరుకలిసి కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక మరికొందరు నెటిజన్లు త్వరలో వీరిద్దరిని కలిసి ఓ సినిమాలో చూడాలనుకుంటున్నారు. ఇక‌.. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా ఈ నెల (మార్చి) 23న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement