Saturday, April 20, 2024

తెలుగు నేర్చుకుంటున్న సీత?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. కృతి సనన్ సీతగా కనిపించనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. మిగిలిన లాంగ్వేజ్ లలో దుబ్బింగ్ చేస్తున్నారు. కాగా కృతీ సనన్ తెలుగుపై అవగాహన తెచ్చుకుని నటించేందుకు ట్యూటర్ ని నియమించుకుందట! డైలాగ్స్ పైనే దృష్టి పెట్టిందట.

సహజంగా అనిపించేందుకే శిక్షకుడి సాయంతో తెలుగు భాషపై పట్టు సాదించేందుకు ప్రయత్నం చేస్తుందట. మరి కృతి ఎంతవరకు తెలుగు పై పట్టుసాధిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు సలార్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement